జ‌యంత్ సి.ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `న‌రేంద్ర` చిత్రంలో హీరోయిన్‌గా ప్ర‌ముఖ మోడ‌ల్ ఇజాబెల్లె

ఐ ఫ్రేమ్స్ మీడియా.కాం: ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, బావ‌గారూ బాగున్నారా, శంక‌ర్ దాదా ఎం.బి.బి.ఎస్‌, ల‌క్ష్మీన‌ర‌సింహ‌.. వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల డైరెక్ట‌ర్ చేసిన వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ జ‌యంత్‌.సి.ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో ఈషాన్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ నిర్మాణంలో నిలేష్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `న‌రేంద్ర‌`. ఈ చిత్రంలో ప్ర‌ముఖ మోడ‌ల్ ఇజా బెల్లె హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్ప‌టికే ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ మార్చి 10 నుండి హైద‌రాబాద్‌లో ప్రారంభం కానుంది.  ఈ సంద‌ర్భంగా ..

వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ జ‌యంత్ సి.ప‌రాన్జీ మాట్లాడుతూ - ``నిలేష్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో.. చాంపియ‌న్‌గా ఎదిగిన ఓ బాక్స‌ర్ క‌థాంశంతో తెరెక్కుతోన్న మా `న‌రేంద్ర`. ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. ఈ  చిత్రం ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ మార్చి 10 నుండి ప్రారంభం కానుంది. వ‌ర‌ల్డ్ రెజ్లింగ్‌లో మ‌న దేశం త‌ర‌పున స‌త్తా చాటుతున్న స్టార్ రెజ్ల‌ర్ గ్రేట్ కాళీ ఈ చిత్రంలో న‌టిస్తుండం విశేషం. అలాగే అలాగే ప్ర‌ముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ రామ్ సంప‌త్ కూడా ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే ప్ర‌ముఖ మోడ‌ల్ ఇజా బెల్లె హీరోయిన్‌గా న‌టిస్తుంది. సినిమాను అనుకున్న ప్ర‌ణాళిక‌లో తెర‌కెక్కిస్తున్నాం. అన్నీ ఎమోష‌న్స్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమా ఉంటుంది`` అన్నారు. 

హీరోయిన్ ఇజా బెల్లా మాట్లాడుతూ - ``జ‌యంత్ వంటి సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌గారితో ప‌నిచేయ‌డం హ్య‌పీగా ఉంది. చాలా ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాను. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు. 

నిలేష్ , ఇజా బెల్లె, ది గ్రేట్ కాళీ న‌టిస్తోన్న ఈ చిత్రానికి పి.ఆర్‌.ఒ: వ‌ంశీ-శేఖ‌ర్‌, ఫైట్స్‌:  వెంక‌ట్‌, డైలాగ్స్‌:  హ‌రీష్ కోయ‌ల గుండ్ల‌,  ఎడిట‌ర్‌:  మార్తాండ్ కె.వెంక‌టేష్‌,  సంగీతం:  రామ్ సంప‌త్‌, కెమెరా:  వీరేన్ తంబిదొరై, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  హ‌రీష్ కోయ‌ల‌గుండ్ల‌, నిర్మాత‌:  ఈషాన్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: జ‌యంత్ సి.పరాన్జీ.

Nilesh Eti, Izabelle Leiti, The Great Khali, Telugu Models, iFrames Entertainment, Jayanth C. Paranji, Eshaan Entertainments

Related Articles