ఒకే ‘బస్సు’లో బన్నీ, మోడల్ పరుల్

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ డాన్స్ గురించి పొగుడుతూ పంజాబీ మోడల్ పరుల్ గులాఠీ సోషల్ మీడియాలో పోస్టు చేయడం వెనుక కొత్త కథే కనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే..అల్లు అర్జున్ ఇప్పటికే రెడ్ బస్ ప్రకటనలో నటించారు. కొత్త ప్రకటనలో బన్నీకి తోడుగా పంజాబీ మోడల్ పరుల్ గులాఠీ నటించారు. ఈ సందర్భంగా బన్నీతో దిగిన సెల్ఫీని ఆమె పోస్ట్ చేస్తూ.. బన్నీ డాన్స్ బాగా చేస్తాడని వ్యాఖ్యానించారు. వాస్తవానికి బన్నీతో డాన్స్ చేసే అవకాశం పరుల్ కి రాలేదు. కాని బన్నీ డాన్స్ గురించి వ్యాఖ్యానించారంటే..టాలీవుడ్ పై కన్నేసినట్లు ఉందని, ఒక్క ఛాన్స్ కోసం అయి ఉంటుందని ఫిలింనగర్ టాక్.

Related Articles