బాబుకు రిటర్న్ గిఫ్ట్ పక్కా! బండి రమేష్ ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ

క్వశ్చన్:  టీఆర్ఎస్ నుంచి మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి మీ పేరు వినిపిస్తోంది?

ఆన్సర్:  కేసీఆర్ ఏం చేయమంటే అది చేస్తా. మల్కాజ్ గిరీనా లేదా కార్పొరేటర్ గా చేయమన్నా చేస్తా. లేదు రాజ్యసభ అంటే దానికైనా సిద్దం. కేసీఆర్ చెప్పిన దానికి దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఆయన పిలిచి రమేష్ దూకు అంటే దూకేస్తా.

క్వశ్చన్:  అసెంబ్లీ ఎలక్షన్స్ లో వైసీపీ, జనసేనతో టీఆర్ఎస్ కుమ్మక్కైందన్న విమర్శలకు ఏమంటారు?

ఆన్సర్:  కూటమి వాళ్లను వాళ్లు కూడా తెచ్చుకున్నారు కదా. వైసీపీ, జనసేన వాళ్లకు కేసీఆర్ పాలన నచ్చి ఉండొచ్చు! అందుకే టీఆర్ఎస్ కు సపోర్ట్ చేశారు. పర్టిక్యూలర్ గా వైసీపీ, జనసేన అని కాదు... హైదరాబాద్ అభివృద్ధి చెందింది, వాళ్ల అవసరాలు తీరుతున్నాయి... సౌకర్యాలు పెరిగాయి... వాళ్లంతా హాయిగా ఉంటున్నారు. అందుకే మద్ధతిచ్చారు. మేం ఎవరి మద్ధతు అడగం... ఒంటరిగానే వెళతాం అని చెప్పాం. ఇష్టంతో వాళ్లు మద్ధతిస్తామంటే తీసుకోవడంలో తప్పేముంది. కేసీఆర్ పాలన నచ్చితే ఎవరైనా మద్ధతిస్తారు. అలాగే వాళ్లకు నచ్చింది... ఓటేశారు.

క్వశ్చన్:  చంద్రబాబును ఓడించాలన్న ఆలోచనతోనే వాళ్లు మద్ధతిచ్చారు కదా?

ఆన్సర్:  అది మీ ఆలోచన. జనానికి కేసీఆర్ పాలన నచ్చింది. అందుకే ఓటేశారు. ఎవరైతే ఏమిటి. గవర్నమెంట్ బాగుంది. మళ్లీ కావాలని కోరుకున్నారు.

క్వశ్చన్: కేటీఆర్ ఫోన్ చేయడం వల్లే కూకట్ పల్లిలో సుహాసిని ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ రాలేదన్న ప్రచారం ఉంది...?

ఆన్సర్ : మేం ఎవరినీ అడ్డుకో లేదు. జూనియర్ ఎందుకు రాలేదు అన్నది వాళ్ల కుటుంబ అంతర్గత విషయం.  మోడీ వచ్చాడు. ఇంకెవరెవరో వచ్చారు. ఏపీ నుంచి కులానికి నలుగు మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు వచ్చారు. జూనియర్ ఎందుకు రాలేదో మాకు తెలీదు. కేటీఆర్ కు ఆపాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ వచ్చి తొడగొట్టి వెళ్లారు ఏమైంది? అవసరమా...!? సుహాసినీ పోటీ చేస్తోంది. ఓటేసి గెలిపిస్తే ఇలా సేవ చేస్తాం అని చెప్పుకోవడంలో తప్పు లేదు. తొడలు గొడితే తెలంగాణ ప్రజలు పిచ్చోళ్లా... ఓట్లు వేయడానికి. హీరోలుహీరోయిన్లు వచ్చారు. రాయలసీమ రెడ్డిల కోసం రెడ్డిగారు వచ్చారు. శ్రీకాకుళం 26 బీసీ కులాలు వాళ్ల కోసం రామ్మోహన్ నాయుడు తదితరులు వచ్చారు. రాజకీయంలో వైసీపీ వాళ్లు, జనసేన వాళ్లు వచ్చారు. వాళ్లు వచ్చి ప్రచారం చేయడం తప్పు కాదు... ఏం సాధించారన్నదే ప్రశ్న.

క్వశ్చన్:  జూనియర్ వస్తే ఫలితాలు మారేవా?

ఆన్సర్ : వచ్చినా ఎంత మారతాయి? ఆయనకు కొందరు అభిమానులు ఉండొచ్చు. తాత్కాలికంగా వాళ్ల హడావుడి ఉంటుంది. నేను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు చిరంజీవికి వచ్చిన జనాలను చూశాను. చిరంజీవిని చూసి మరో ఎన్టీఆరా అనిపించింది... ఆ జనాలు చూసి. అయినా ఓట్లు పడలేదు. ఇప్పుడు జూనియర్ వచ్చినా అదే జరిగేది.

క్వశ్చన్:  చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ అంటున్నారు... ఏమై ఉంటుంది?

ఆన్సర్:  త్వరలో మీరే చూస్తారుగా... ఎలక్షన్స్ దగ్గరలోనే ఉన్నాయిగా...గిఫ్ట్ ఇవ్వడం పక్కా. ఎలా ఇస్తాం... ఆంధ్రాలో మీ పార్టీ ఏదీ అంటే...  బీఎస్పీ ఉత్తర ప్రదేశ్ పార్టీ. ఐనా తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో 70 సీట్లు వరకు ఏనుగు గుర్తు పై నిలబడింది. యూపీ బీఎస్పీకి తెలంగాణకు ఏమిటి సంబంధం... అంటే. ఇదీ అలాగే.

క్వశ్చన్:  తెలంగాణలో బీఎస్పీ ఎక్కడుంది... జాతీయ పార్టీ హోదా కోసం పోటీ చేస్తారు... అంతే?

ఆన్సర్:  లేదు అనుకుంటే ఎలా? అదే బీఎస్పీ గుర్తు పై పోయిన సారి కోనేరు కోనప్ప గెలిచారు కదా! ఏపీలో పోటీ చేస్తామా...  గెలుస్తామా అన్నది కాసేపు పక్కన పెడదాం. బాబుకు రిటర్న్ గిఫ్ట్ పక్కా. అది ఎలా ఉంటుందో చూద్దాం. 2001లో టీఆర్ఎస్ పుట్టినప్పుడు నలుగురు నుంచో లేదు. గులాబీ కండువా వేసుకోవడానికి జనాలు ఇష్టపడలేదు. అదే టీఆర్ఎస్ కు గ్రేటర్ లో 99 సీట్లు వచ్చాయి. అలాగే, ప్రజలకు అభిమానం ఉంటుంది.

క్వశ్చన్:  జగన్ ద్వారా గిఫ్ట్ ఇస్తారా?

ఆన్సర్:  అది ఇప్పుడే చెప్పం(నవ్వు). గిఫ్ట్ ఐతే పక్కా! ఇది కుమ్మక్కు రాజకీయం అంటారా...! అలాంటి వాటికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడే. గూడుపుఠాణీ చంద్రబాబుకే చెల్లు. టీడీపీ తెలంగాణ విషయంలో కూడా మోసం చేసింది. బయటకు లేఖ ఇచ్చింది... లోలోపల వ్యతిరేకించింది. ముల్లును ముల్లుతోనే తీసినట్టు... కుమ్మక్కును కుమ్మక్కుతోనే కొడతాం.

క్వశ్చన్ :  జగన్ అంటే కేసీఆర్ కు అంత అభిమానం దేనికి?

ఆన్సర్:  ఎవరు చెప్పారు మీకు. మీకేమైనా కలపడిందా. మీరెలా అనుకుంటున్నారు. జగన్ 300 రోజుల నుంచీ ఆంధ్రాలో రోడ్ల పై తిరుగుతున్నాడు. కష్టపడుతున్నాడని కేటీఆర్ కి అనిపించి ఉండొచ్చు. అందుకే జగన్ బాగా కష్టపడుతున్నాడు అని ఉండొచ్చు. అదే చంద్రబాబును హైటెక్ సిటీ కట్టారని కూడా కేటీఆర్ అన్నారు కదా.

క్వశ్చన్:  తుమ్మల ఎలా ఓడిపోయారు... అలాంటి నాయకుడు ఓడిపోవడం ఏమిటి?

ఆన్సర్:  తుమ్మల పొలిటికల్ గా నా గాడ్ ఫాదర్. ఆయన జిల్లా బాధ్యత అంతా నెత్తిన పెట్టుకున్నారు. నియోజకవర్గం పై దృష్టి పెట్టుకోలేదు. అన్నీ సీట్లు కొట్టాలనుకున్నారు. అదొక కారణం. కొంత పార్టీ అంతర్గత రాజకీయాలు ఉన్నాయి. చిన్న ఇబ్బందులతో ఓడిపోయారు. స్వయంకృతమే అనుకోవాలి. ఆయన దృష్టంతా జిల్లా పై ఉండిపోయింది. అయినా, సీఎంకు ఆయన పై అభిమానం తగ్గదు. గెలుపోటములు సహజం. అంత మాత్రాన తుమ్మల ఇమేజ్ తగ్గదు. వాళ్లిద్దరు సమ ఉజ్జీలు. సీఎంకు తుమ్మల అంటే చాలా గౌరవం. ఏ పరిస్థితుల్లోనైనా తుమ్మలను పక్కనే పెట్టుకుంటారు. పార్టీలో తుమ్మల గౌరవ ప్రదమైన పరిస్థితుల్లోనే ఉంటారు.

Bandi Ramesh, KCR, Return Gift, ChandraBabu Naidu, iFramesMedia

Related Articles