అర్జున్ పై లైంగిక ఆరోపణలు..వెనక్కి తగ్గేదే లేదన్న హీరోయిన్

కోలీవుడ్, టాలీవుడ్ సినీ హీరో అర్జున్‌ పై మీటూ ఆరోపణలు చేసిన శ్రుతి హరిహరన్ పై హీరో అర్జున్ తరఫున వారు న్యాయపోరాటానికి దిగారు. రూ.5కోట్లమేరకు పరువు నష్టం దావా దాఖలుచేశారు.  అయితే దీనిపై శ్రుతిహరిహరణ్ స్పందిస్తూ.. ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించినట్టు టి.నగర్ టాక్. ‘నిబునన్‌’ సినిమా షూటింగ్‌ సందర్భంగా అర్జున్‌ తనను వేధించాడంటూ శ్రుతి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల కర్ణాటక ఫిలించాంబర్‌ అధ్యక్షుడు అంబరీశ్‌, ఇతర సభ్యులు గురువారం శ్రుతి‌, అర్జున్‌లతో చర్చించారు. అయితే తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని శ్రుతి చెప్పడం, తరువాత శ్రుతిపై అర్జున్‌ తరఫున ఆయన మేనల్లుడు ధృవ బెంగళూరు కోర్టులో రూ.5 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.

Related Articles