కాకినాడ వాసి హ‌నుమ విహారికి ఐపీఎల్ లో రూ.2 కోట్ల..

ఐ ఫ్రేమ్స్ మీడియా.కాం: ఐపీఎల్ 2019 వేలంలో  మ‌రో తెలుగుతేజం మెరిసింది. కాకినాడ‌కు చెందిన హ‌నుమ విహారిని ఢిల్లీ క్యాపిట‌ల్స్ రూ.2కోట్ల‌కు ద‌క్కించుకుంది. ఈ వేలంలో యువ‌రాజ్ సింగ్‌, పుజారా, తివారీల‌ను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు. జ‌య‌పుర‌లో జ‌రుగుతున్న ఐపీఎల్ వేలంలో ప‌లువురు స్టార్ క్రికెట‌ర్లను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు. గ‌తేడాది కింగ్స్ ఎలెవ‌న్ త‌ర‌పున ఆడిన యువ‌రాజ్ అప్ప‌ట్లో రూ.2కోట్లు ప‌లికాడు. ప్ర‌స్తుతం డిమాండ్ లేక‌పోవ‌డంతో అభిమానుల‌కు ఒకింత నిరాశే మిగిలింది. కాగా ఈ వేలంలో వెస్టిండీస్ ఆట‌గాళ్లైన కార్లోస్ ను కోల్ క‌త నైట్ రైడ‌ర్స్ రూ.5కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అక్ష‌ర‌ప‌టేల్ ను  దిల్లీ రూ.5కోట్లు, షిమ్రాన్ హెట్ మెయిన‌ర్ రూ.4.2 కోట్లు, గుర్ కీర‌త్ సింగ్ రూ.50 ల‌క్ష‌లు వెచ్చించి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ కొనుగోలు చేశాయి. యూవీ, పుజారా, తివారీల‌తోపాటు అలెక్స్‌ హేల్స్‌, బ్రెండన్‌ మెక్‌కలమ్‌ను కొనుగోలు చేసేందుకు ప్రాంఛైజీలు ఆసక్తి చూపించలేదు.

Hanuma. IPT2019

Related Articles