టీఆర్ఎస్ రాజగురువు ఇంటికి ఉత్తమ్! షాక్ లో టీ కాంగ్రెస్

సమయ రాత్రి 8 గంటలవుతోంది. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని నందగిరి హిల్స్ లోని ఓ ఇంటికి వెళ్లారు. ఆ విషయం ఆ నోటా ఈనోటా టీ కాంగ్రెస్ నేతలందరికీ తెలిసింది. అందరూ ఒక్క సారిగా షాక్. ఉత్తమ్ వెళ్లింది ఎక్కడికో కాదు... టీఆర్ఎస్ కు రాజగురువుగా భావించే మైహోం రామేశ్వరరావు హోంకు. ఎన్నికలు ముగిసి నెల రోజులు కాలేదు. అప్పుడే ఉత్తమ్ ఇలా చేయడం ఏమిటన్న చర్చ మొదలైంది. రామేశ్వరరావు ఇంటికి ఉత్తమ్ వెళ్లడం ఏమిటన్న చర్చ మొదలైంది. అసలు ఉత్తమ్ అక్కడకు ఎందుకు వెళ్లారన్న సందేహాలు అందరిలో స్టార్ట్ అయ్యాయి. తీరా ఆరా తీస్తే... మై హోం రామేశ్వరరావు ఇంట్లో చినజియార్ స్వామి ఏవో ప్రవచనాలు చెబుతున్నారట. దనుర్మాసం సందర్భంగా ఆ ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారట. దానికి ఉత్తమ్ ను ఆహ్వానించారు. ఆయన కార్యక్రమానికి హాజరై కొద్ది సేపు ఉండి వెళ్లిపోయారు. అదీ విషయం....

ఐనా, రామేశ్వరరావు ఇంటికి ఉత్తమ్ వెళ్లడం ఇప్పుడే కొత్త కాదన్నది గాంధీ భవన్ టాక్. ఆయన రెగ్యూలర్ గా మైహోం ఇంటికి వెళుతూనే ఉంటారట. వారిద్దరు మంచి ఫ్రెండ్స్ అట. ఇద్దరి మధ్య లావాదేవీలు కూడా ఉన్నాయని చెబుతారు. అది ఎంత వరకు నిజమో తెలియదు. ఇద్దరి మధ్య ఏమీ లేకపోతే వారం వారం మై హోం ఇంటికి వెళ్లే అవసరం ఉత్తమ్ కు ఏమిటన్నది గాంధీ భవన్ క్వశ్చన్. మై హోం ఇంటికి ప్రతి శనివారం ఉత్తమ్ వెళుతుంటారని టాక్. ఏది ఏమైనా... ఈ యవ్వారం మాత్రం టీ కాంగ్రెస్ కార్యకర్తలకు నచ్చడం లేదు. ఉత్తమ్ కు మై హోం ఫ్రెండ్ ఐతే అయి ఉండొచ్చు... కానీ, పార్టీని లీడ్ చేసే నాయకుడు ఇలా చేయడం ఇమ్మోరల్ అంటున్నారు.  ఎంతైనా రామేశ్వరరావు అండ్ కో టీఆర్ఎస్ హెడ్ కు సన్నిహితులు. అందులో డౌటే లేదు. అలాంటి ఇలాకాకు టీ పీసీసీ బాస్ వెళ్లడం మాత్రం మోరల్ గా కరెక్ట్ కాదంటున్నాయి పొలిటికల్ వర్గాలు.

 

Related Articles