సీఎం ఆఫీసే కోర్టు హాలు!

ఐ ఫ్రేమ్స్ మీడియా.కాం: రాష్ట్ర విభజన తర్వాత నాలుగున్నరేళ్లకు హైకోర్టు విభజన జరిగింది. జనవరి 1 నుంచి ఏపీలో ప్రత్యేక హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనం నిర్మాణం జరుగుతోంది. ఆ భవన నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఐతే, ఈలోపే కోర్టు విభజనకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వ్యూలు వెలువడటంతో వెంటనే ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించాల్సిన అనివార్యత ఏర్పడింది. దీనిపై ఏపీ ప్రభుత్వం తగు చర్యలకు సిద్ధపడింది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక విజయవాడకు మకాం మార్చినప్పుడు అప్పటి ఇరిగేషన్ శాఖ కార్యాలయానికి మెరుగులు దిద్ది దాన్నే సీఎం కార్యాలయంగా వినియోగించారు. ఆ తర్వాత అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మించుకుని అక్కడకు పరిపాలనను తరలించారు. ఇరిగేషన్ శాఖ కార్యాలయం ఇప్పటికీ సీఎం క్యాంప్ ఆఫీసుగానే ఉంది. తాజాగా హైకోర్టుకు వసతి సదుపాయం కల్పించాల్సి రావడంతో ఈ ఇరిగేషన్ శాఖ కార్యాలయాన్నే కేటాయించబోతున్నారు. తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణం పూర్తయ్యే వరకు సీఎం క్యాంపు కార్యాలయమే హైకోర్టు కార్యాలయంగా పని చేయబోతోంది.

Related Articles