అమరావతిలో ఐదు టవర్లు...!

ఐ ఫ్రేమ్స్ మీడియా.కాం: ఎట్టకేలకు అమరావతిలో శాశ్వత సచివాలయ భవన నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఇన్నాళ్లు కేంద్ర సహకారం కోసం ఎదురు చూసిన ఏఫీ ప్రభుత్వం ఇప్పుడు తానే రంగంలోకి దిగింది. గడచిన నాలుగున్నరేళ్లుగా ఓ వైపు డిజైన్లు, మరోవైపు కేంద్రం నిధుల పై వేచి చూసిన ఏపీ సర్కారు తాజాగా డిజైన్లు ఫైనలైజ్ చేసుకుంది. కేంద్రం నుంచి ఆశించిన సాయం రాదన్న నిర్ధారణకు వచ్చాక ఇక తానే నిర్మాణ పనులకు సిద్ధపడింది. సచివాలయం, హెచ్వోడీ కార్యాలయాల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేశారు. మొత్తం అయిదు టవర్లు నిర్మాణం చేయబోతున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన టవర్ కూడా ఇందులో ఉండబోతోంది. 60 లక్షల చదరపు అడుగుల కార్యాలయ సదుపాయం ఉండబోతోందని చెబుతున్నారు. దీనితో పాటు కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి కూడా బాబు శంకుస్థాపన చేశారు. ఈ ఫ్యాక్టరీ కోసం కేంద్రాన్ని పదే పదే కోరినా పట్టించుకోకపోవడంతో ఏపీ ప్రభుత్వమే రంగంలోకి దిగి ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతోంది. మొత్తం రూ.18000 కోట్లతో ఈ ఫ్యాక్టరీ నిర్మించబోతున్నారు.

Related Articles