ఈసీ ఇంత దారుణమా...!?

ఐ ఫ్రేమ్స్ మీడియా.కాం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి 24 గంటలు కావస్తోంది. ఇంత వరకు అసలు ఎంత శాతం పోలింగ్ జరిగిందో అధికారిక ప్రకటన లేదు. ఎంత పోలింగ్ జరిగిందన్నది స్పష్టంగా ప్రకటించాల్సిన ఎన్నికల సంఘం ఇంత వరకు ఆ పని చేయలేదు. పోలింగ్ శాతం ఎంతో ఎందుకు ప్రకటించడం లేదో అర్థం కాని పరిస్థితి. ఈసీ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ నేతగజ్వేల్ నుంచి కేసీఆర్ పై పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణం పోలింగ్ శాతం ప్రకటించాలని లేకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. పోలింగ్ శాతం ప్రకటించడం పై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్టు కొన్ని టీవీ ఛానెళ్లలో వార్తలు వస్తున్నాయి. పోలింగ్ శాతాన్ని ప్రకటించడం ఈసీ బాధ్యత. అలాంటిదిమల్లగుల్లాలు పడాల్సిన అవసరం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ విషయంలో ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా... ఉంటే ఎవరి నుంచి ఉన్నాయి... ఒత్తిళ్లు ఉన్నంత మాత్రాన స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఈసీ ఒత్తిళ్లకు లోనవడం ఏమిటి అన్నది అర్థం కాని విషయం. తెలంగాణలో పోలింగ్ శాతం పెరిగితే ప్రజాకూటమిదే అధికారం అని లగడపాటి ప్రకటించారు. పోలింగ్ శాతం 75.3 ఉన్నట్టు అనధికారికంగా లెక్కతేలింది. ఉమ్మడి జిల్లాల వారిగా కూడా పోలింగ్ శాతం వచ్చేంసింది. దాదాపు అన్నీ జిల్లాల్లో 77 నుంచి 80 శాతం మేర పోలింగ్ జరిగినట్టు లెక్కలు చూస్తే అర్థమవుతోంది. ఆ లెక్కలనే ఈసీ ఎందుకు అధికారికంగా ప్రకటించడం లేదన్నది ఇప్పుడు ప్రశ్న.

Related Articles