రేవంత్ కేసులో ఎస్పీ బదిలీ!

ఐ ఫ్రేమ్స్ మీడియా.కాం: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టు కేసులో వికారాబాద్ జిల్లా అన్నపూర్ణ పై బదిలీ వేటు పడింది. ఇప్పటికే ఈ కేసు విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి తలంటింది. స్వయంగా డీజీపీ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం నష్టనివారణకు సిద్ధపడినట్టు కనిపిస్తోంది. ఎస్పీ అన్నపూర్ణను తక్షణం బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోలీసు హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేయాల్సిందిగా ఆదేశించింది. అన్నపూర్ణ స్థానంలో అవినాష్ మహంతిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటనతో మొత్తం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది. ఎన్నికల సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు వెళ్లినట్టయింది.

Related Articles