ఆయనెళితే... ముస్లీంలు పడిపోతారా!?

ఐ ఫ్రేమ్స్ మీడియా.కాం: ఆంధ్రాలో ముస్లీం ఓటు బ్యాంకు ఎవరి వైపు ఉంది? అంటే ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు మాత్రం వాళ్లు టీడీపీతోనే ఉన్నారని చెబుతున్నారు. ముఖ్యంగా మోడీ సర్కారు నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత ముస్లీంలలో గణనీయమైన మార్పు వచ్చిందంటున్నారు. రాయలసీమ జిల్లాల్లో ముస్లీంలు అంతకు ముందు జగన్ వైపు ఊగినా ఎన్డీయేకు టీడీపీ గుడ్ బై చెప్పడంతో పాటు, కాంగ్రెస్ తో జట్టు కట్టాక పూర్తి స్థాయిలో టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారట. అయితే, తాజాగా సదరు ముస్లీం ఓటు బ్యాంకును తిరిగి జగన్ వైపు మళ్లీంచేందుకు తెలంగాణ ముఖ్యంమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణలో తన గెలుపునకు పూర్తి స్థాయి సహాయసహకారాలు అందించిన ఎంఐఎం ను ఆంధ్రా పై ప్రయోగించేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఆంధ్రాలో ముస్లీం ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాల్లో పర్యటించి, వాళ్లను వైసీపీకి అనుకూలంగా మలిచే మిషన్ ను అసదుద్ధీన్ ఒవైసీకి కేసీఆర్ అప్పగించినట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఇటీవల చెప్పిన కేసీఆర్ అందులో భాగంగానే ఈ వ్యూహ రచన చేస్తున్నట్టు చెబుతున్నారు.

ఇంత వరకు బాగానే ఉంది. ఆంధ్రా ముస్లీంలు ఓవైసీ మాట వింటారా అన్నది ఇక్కడ ప్రశ్న. పైగా కేసీఆర్ ఇప్పుడు మోడీతో దోస్తీ చేస్తున్నారు. అలాంటి కేసీఆర్ తో ఓవైసీ దోస్తీ చేస్తున్నారు. అంటో పరోక్షంగా ఇందంతా మోడీ బ్యాంచ్ లో భాగమే. పైగా తెలంగాణ, హైదారాబాద్ ముస్లీంల ఆలోచనలు వేరు, ఆంధ్రా ముస్లీంల ఆలోచనలు వేరుగా ఉంటాయన్నది ఓ విశ్లేషణ. ఆంధ్రా ముస్లీంలు మెజారిటీ సాయబులు. వాళ్లు తెలంగాణ ముస్లీంల మనోభావాలు, ఆలోచనలకు భిన్నంగా ఉంటారు. ఆంధ్రా భాష, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగి ఉంటారు. అలాంటి వాళ్లకు ఓవైసీ వెళ్లి దిశానిర్దేశం చేస్తే వింటారా అని ఓ రాజకీయ పెద్ద మనిషి ప్రశ్నించారు. నిజమే... ఈ ప్రశ్నకు సమాధానం అంత తేలికేం కాదు. చూద్దాం... ఏం జరుగుతోందో!

Related Articles