ట్రక్కు పై కేసీఆర్ కంప్లెయింట్!

ఐ ఫ్రేమ్స్ మీడియా.కాం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఎన్నికలు ముగిశాక ఎన్నికల సంఘంతో పనేంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. తెలంగాణ ఎన్నికల్లో చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులకు ట్రక్కు గుర్తు కేటాయించడం పై ఆయన ఈసీని కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో కారుకు పడాల్సిన ఓట్లు ట్రక్కుకు పడి టీఆర్ఎస్ కు నష్టం వాటిల్లిందన్నది ఆ పార్టీ వర్గాల వాదన. ఉదాహరణకు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ట్రక్కు గుర్తుకు 2,600 ఓట్లు పోలయ్యాయి. అలాగే చాలా నియోజకవర్గాల్లో ట్రక్కుకు బాగానే ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లన్నీ తమవేనన్నది కేసీఆర్ అండ్ కో వాదన. సదరు ఓటర్లు కారుకు, ట్రక్కుకు మధ్య తేడాను పోల్చుకోలేక ట్రక్కుకే గుద్దేశారన్నది టీఆర్ఎస్ వాదన. అందుకే ట్రక్కు గుర్తు కేటాయించడం పై ఈసీని కలిసి కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఐతే, ఎవరికి ఏ గుర్తు కేటాయించాలన్నది ఈసీ పరిదిలోని అంశం. దానిపై కూడా కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేయడం కరెక్టేనా అన్న వాదన ఉంది.

Related Articles