అందులో బాబు మిస్టేక్ ఏం లేదంటోన్న టీఆర్ఎస్...

ఐ ఫ్రేమ్స్ మీడియా.కాం: తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎలా గెలిచింది? దీనికి ఎవరి ఈక్వేషన్లు వాళ్లకు ఉన్నాయి. కానీ, రాజకీయ పార్టీలు మాత్రం దీనికి కారణాలు వెతికే పనిలో పడ్డాయి. టీఆర్ఎస్ గెలుపునకు నిజమైన కారణం ఏమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ, పార్టీలు మాత్రం ఎవరి కారణాల్లో వారు మునిగి తేలుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విషయానికి వస్తే... ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది ఆ పార్టీ ప్రధానంగా చెబుతోన్న విషయం. ఇక అంతర్గతంగా చంద్రబాబు ప్రచారం కూడా తమ అవకాశాలను దెబ్బతీసిందన్నది మరో కారణం. అయితే, భవిష్యత్ లో కేంద్ర స్థాయిలో చంద్రబాబుతో తమ అధినేత రాహుల్ గాంధీకి అవసరం ఉంటుంది కనుక... బాబును బహిరంగంగా టీ కాంగ్రెస్ టార్గెట్ చేయడం లేదు. మిగతా విశ్లేషకులు మాత్రం బాబు ప్రచారం వికటించడమే టీఆర్ఎస్ గెలుపునకు కారణంగా చెబుతున్నారు.

ఈ ప్రచారం పై టీఆర్ఎస్ ఇప్పుడు తెగ గింజుకుంటోంది. తమ గెలుపునకు చంద్రబాబు కారణం అన్న వాదనను ఆ పార్టీ ఏ మాత్రం జీర్ణించుకోవడం లేదు. అదేంటి... ఎన్నికలకు ముందు ప్రతి బహిరంగ సభలో కేసీఆర్ ఈ విషయాన్నే కోడై కూశారు కదా అనుకుంటున్నారా!? అవును... చంద్రబాబును కాంగ్రెస్ భుజాల పై మోసుకొస్తోందని, తెలంగాణను అమరావతికో, ఢిల్లీకో గులాంగిరీ చేయించబోతున్నారని కేసీఆర్ పదే పదే ఆరోపించారు. ఆయన వాదన జనాల్లోకి బాగానే ఎక్కింది. కేసీఆర్ రేకెత్తించిన ఈ ఆందోళనకర అంశం జనాల్లో సందేహాలకు కారణమైంది. ముమ్మాటికీ కేసీఆర్ గెలుపులో ఈ ఆరోపణ పాత్ర ఉంది అనడంలో సందేహం లేదు. బాబు పై తెలంగాణ ప్రజలకు కోపం ఉందో లేదో తెలియదు కానీ, మళ్లీ ఆయన పెత్తనాన్ని మాత్రం వాళ్లు కోరుకోలేదు. ఈ విషయం కేసీఆర్ పదే పదే చెప్పడంలో జనాల్లో ఆలోచన మొదలైంది. అయితే, టీఆర్ఎస్ మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ గెలుపునకు కారణం తమ పథకాలేనన్నది వారి వాదన. కేసీఆర్ నాలుగున్నరేళ్ల అద్భుతమైన పాలన వల్లే తాము గెలిచామన్నది ఇప్పుడు ఆ పార్టీ లాజిక్. ఎన్నికల ముందు వరకు వాళ్లుకు కూడా ఈ గ్యారెంటీ లేదు. అందుకే సడెన్ గా బాబును బూచిగా చూపెట్టేశారు. తీరా... గెలిచాక ఆ గెలుపును బాబు ఖాతాలో వేయడం ఏమిటీ అది మా ఖాతాలో కదా పడాల్సింది అన్నది వాళ్ల బాధ. ఎలాగైతేనేమీ గెలిచాం కదా అన్న పాయింట్ తో వాళ్లు రాజీ పడటం లేదు. ఈ గెలుపు కేసీఆర్ ఓన్ అన్నది వాళ్ల లెక్క.

అలా తప్పని పరిస్థితుల్లో ఇది చంద్రబాబు పై వ్యతిరేక తీర్పు కాదు... కేసీఆర్ కు అనుకూల తీర్పు అని చెప్పుకోలేక టీఆర్ఎస్ నానా తంటాలు పడుతోన్న పరిస్థితి కనిపిస్తోంది.
ChandraBabu Naidu, KCR, Telangana Elections

Related Articles